యాదాద్రిలో కార్తీక సందడి

వేకువజామునుంచే భక్తుల రాక
వైవాలయాల్లో ప్రత్యేక పూజలు
నల్లగొండ,నవంబర్‌30 (జనం సాక్షి):  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడాయి.  యాదాద్రి, ఛాయా సోమేశ్వరాలయం, కొలనుపాక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో విద్యుద్దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సోమవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని, పరమశివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించారు. దీపారాధనలు చేసేందుకు కోనేరులను తీర్చిదిద్దారు.యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా భక్తులు సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచి భక్తులు పుష్కరణిలో స్నానాలు చేసి దీపారాధన చేశారు. దీపారాధన చేపట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ పుర వీధుల్లో భక్తుల కోలాహలం నెలకొంది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. నల్లగొండ జిల్లాకేంద్రం సవిూపంలోని పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు బ్రహ్మాండగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా రెండు లేన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ భక్తులు అభిషేకాలు నిర్వహించుకునేందుకు వీలుగా వసతి, ఉదయం 6 గంటల నుంచే శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.  కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని తులసీ నగర్‌లోగల శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయంలో జ్వాలా తోరణం వేడుకలు ఘనంగా జరిగాయి. అదే విధంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం, అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాలయాల కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శివాలయాలన్నీ శివ నామ స్మరణతో మార్మోగాయి.  కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పవిత్ర కార్తీక పౌర్ణమి సోమవారం రోజున యాదగిరిగుట్ట ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.  ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే సత్యనారాయణ వ్రతాలను పెద్దెత్తున చేపట్టారు. వేకువజామునుంచే దర్శనాలు, మొక్కు పూజల నిర్వహణకోసం భక్తులు క్యూకట్టారు. దీంతో స్వామివారి దర్శనాలకు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.  బాలాలయంలో కవచమూర్తులకు, ప్రధానాలయంలో స్వయంభువులను ఆరాధించిన అర్చకులు హారతితో కొలిచారు. యాదాద్రీశుడి సన్నిధిలో మూడు రోజులుగా కొనసాగుతున్న శ్రీవైష్ణవ ఆచార్యులు తిరుమంగైళ్వార్‌ తిరునక్షత్ర వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.

తాజావార్తలు