యాదాద్రిలో శరవేగంగా టెంపుల్ నిర్మాణం
త్వరితగతిన పూర్తి చేసేలా ప్రయత్నాలు
ఎండలను సైతం లెక్క చేయకుండా కార్మికుల శ్రమ
యాదాద్రి,మే12(జనం సాక్షి): సీఎం కెసిఆర్ మహాసంకల్పంతో తిరుమలను తలపించే విధంగా నిర్మాణాలు యాదాద్రిలో జోరుగా సాగుతున్నాయి. శిలలను అమర్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహుడికి పరమభక్తుడి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుమలకు దీటుగా యాదాద్రి ఉండాలని సంకల్పించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ¬దాలో ఆయన యాదాద్రిలో 2014 అక్టోబర్ 17న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు యాదాద్రి అభివృద్ధి ప్రగతి పరుగులు పెడుతుండగా, అదే స్థాయిలో పర్యాటక రంగం ఊపందుకున్నది. ఎండాకాలమైనా ఎక్కడా పనులు ఆగడం లేదు. యధావిధిగా శిలల అమర్పు పనులు సాగుతున్నాయి. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రారంభించి సీనియర్ ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావును వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. యాదాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరగడం ప్రారంభమైంది. కాకతీయ మహారాజుల రాజసాన్ని చాటిచెప్పే సంప్రదాయ స్తంభాలు వాటిపైన 55 అడుగుల ఎత్తులో స్వర్ణగోపురం…శివాలయం వీధిలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన యాదాద్రి క్షేత్రపాలక ఆంజనేయస్వామి కాంస్య విగ్రహం… యాదాద్రిలో ఎటు చూసినా పచ్చదనం… ఉల్లాసభరిత ఉద్యానవనాలు… సకల సదుపాయాలతో కూడిన వసతి గృహాలు… హెలిప్యాడ్ నిర్మాణాలు…రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం…ఇలా సకల పనులు ఏకకాలంలో మొదలై మూడేళ్లుగా ఆలయ విస్తరణ పనులు
శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పనులను పర్యవేక్షిస్తున్న అరుదైన సన్నివేశం యాదాద్రిలో ఆవిష్కృతమవుతున్నది. ఆధ్యాత్మిక దేవనగరి యాదాద్రి రూపుదిద్దుకుంటున్నది. కృష్ణశిల్ప కళాసౌరభాలు. సప్తగోపురాలు.. ప్రాకారాలు.. బాహ్య ప్రాకారాలు.. మాడ వీధులు.. శ్రీవైష్ణవ విశిష్టతను చాటిచెప్పే 12 ఆళ్వార్ మహాస్తంభాలు.. కాకతీయ మహారాజుల రాజసాన్ని చాటిచెప్పే సంప్రదాయ స్తంభాలు… వాటిపైన 55 అడుగుల ఎత్తులో స్వర్ణగోపురం.. శివాలయం వీధిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన యాదాద్రి క్షేత్రపాలక ఆంజనేయస్వామి కాంస్య విగ్రహం.. యాదాద్రిలో ఎటు చూసినా పచ్చదనం.. మానసిక ఉల్లాసభరిత ఉద్యానవనాలు.. సకల సదుపాయాలతో కూడిన వసతి గృహాలు… రాష్ట్రపతితో పాటు ఒకే సమయంలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి విచ్చేసిన సరిపోను వసతులు.. హెలిప్యాడ్
నిర్మాణాలు.. ఘాట్‌రోడ్డుపైకి శ్రీవారిని చేరుకోవడానికి రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
కనీవిని ఎరుగని రీతిలో టెంపుల్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 100 కోట్ల చొప్పున కేటాయిస్తూ ఇప్పటికి రూ. 300 కోట్లను విడుదల చేశారు. ఇవిగాకుండా పనుల నిర్వహణను బట్టి మూడు నెలలకోసారి ప్రత్కేక నిధులను కూడా విడుదల చేస్తున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని రెండు వేల ఎకరాల్లో విస్తరించాలని సీఎం కేసీఆర్ తొలిరోజే నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువు పరిసరాల్లో కొండలు.. గుట్టలతో పాటు మైదాన ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేట్ పట్టా భూములను భూ సవిూకరణ జరిపి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్వాధీనం చేశారు. ఇప్పటివరకు 1400 ఎకరాల భూమిని అప్పగించగా, మరో 33 ఎకరాల భూమి భూసేకరణ చట్టం-2013 ప్రకారం సేకరణ పక్రియ కొనసాగుతోంది. యాదగిరిగుట్ట పరిసరాలు, కొండలు.. గుట్టలను పవిత్ర ఆధ్యాత్మిక సన్నిధిగా తీర్చిదిద్ద డానికి ఇప్పటికే ప్రత్యేక లేఅవుట్‌ను రూపొందించిన వైటీడీఏ రూ. 207 కోట్ల అంచనా వ్యయంతో మొదటి దశ పనులను పూర్తి చేసింది. ఆలయ పరిసరాల్లోని 250 ఎకరాల్లో ఆధునిక వసతి కాటేజీలు, ఉద్యాన వనాలు, వైదిక విద్యాసంస్థలు, ఆడిటోరియాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. విశాలమైన సుందరమైన రహదారులు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో ప్రత్యేకమైన టెంపుల్‌సిటీని అభివృద్ధి చేస్తున్నారు. టెంపుల్‌సిటీకి అవసరమైన నీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మేరకు పెద్దగుట్టపై ప్రతిపాదిత లేఅవుట్ ఏర్పాటు ప్రదేశంలో 160 అడుగుల విశాలమైన రహదారులు, మధ్యలో పూలమొక్కలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అనుగుణంగా 18 కిలోవిూటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. కొండకింద గండి చెరువు వద్ద 138 ఎకరాల్లో పలు నిర్మాణాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆరు ఎకరాలలో బస్సు కాంప్లెక్స్, రెండు ఎకరాలలో కల్యాణకట్ట, ప్రస్తుతం ఉన్న గండి చెరువులోనే పుష్కరిణీ, ఆరు ఎకరాల్లో అన్నప్రసాదం కాంప్లెక్స్, 30 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ చేపట్టాలని నిర్ణయించారు. గిరిప్రదక్షిణ కోసం యాదాద్రి కొండ చుట్టూ 150 విూటర్ల వెడల్పులో రింగు రోడ్డు నిర్మాణమవుతోంది. 13 విూటర్ల వెడల్పులో పాదచారుల కోసం పాత్‌వేను ఏర్పాటు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ కోసం మట్టిరోడ్ల నిర్మాణం గోశాల వరకు నిర్మాణం జరిగింది. రూ. 34 కోట్లతో చేపట్టిన యాదాద్రి రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. యాదాద్రికి వచ్చే రోడ్లను నాలుగు వరుసలలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏడు రకాల రోడ్లు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు కన్నా పెద్దవిగా ఉండనున్నాయి. యాదాద్రి-చేర్యాల, యాదాద్రి-వంగపల్లి, యాదాద్రి-కీసర రోడ్లు నాలుగు వరుసలుగా మారుతున్నాయి.
————————-