యాదాద్రి పాతగుట్ట బ్ర¬్మత్సవాల షెడ్యూల్‌ విడుదల

యాదాద్రి భవనగిరి, జనవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక అధ్యయణోత్సవాలు, బ్ర¬్మత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు స్వామివారి అధ్యయణోత్సవాలు, ఈ నెల 24 నుంచి 30 వరకు పాతగుట్ట దేవస్థానంలో స్వామివారి బ్ర¬్మత్సవాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన రాత్రి 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మ¬త్సవం, 28న దివ్య విమాన రథోత్సవం, 30న స్వామివారి శతఘట్టాభిషేకంతో బ్ర¬్మత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 20 నుంచి 23వ తేదీల్లో యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి అధ్యయణోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు నిత్య, శాశ్వత కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.