యాదాద్రీశుడికి వెండి కళశాల సమర్పణ
హైదరాబాద్‌కు చెందిన భక్తుడి కానుక
యాదాద్రి,సెప్టెంబర్17(జనంసాక్షి ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే సీతారాం అనే భక్తుడు 3 వెండి కలశాలను కానుకగా ఇచ్చారు. ఈ మేరకు ఒక్కొక్కటి 460 గ్రాముల బరువు గల 3 వెండి కలశాలను ఆలయాధికారులకు సీతారాం అందజేశారు. ఆలయ అధికరాఉలను, అర్చకులను కలసి వెండివస్తువులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయంలో స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు. ఇదిలావుంటే స్వామి బాలాలయంలో నిత్యపూజలు జరుగుతున్నాయి. సుప్రభాతంతో మేల్కొన్న శ్రీస్వామి అమ్మవార్లు హారతి నివేదన, నిజాభిషేకం, తులసి అర్చనలు పొందారు. స్వర్ణపుష్పాలతో దర్శన మూర్తులకు ప్రత్యక అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య శ్రీసుదర్శననారసింహ ¬మం ఆగమశాస్త్రానుసారంగా నిత్యకల్యాణ పర్వాలు కొనసాగాయి. అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. వారాంతంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వారాంతపు సెలవు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులతో యాదాద్రి పంచనారసింహుల క్షేత్రం సందడినింపుకుంది. ఆర్జిత పూజలతో ఆధాత్మికత నెలకుంది. బాలాలయంలో శ్రీలక్షీనారసింహస్వామికి నిత్యారాధనలు, చరమూర్తుల మందిరంలో రామలింగేశ్వరుడికి పూజలు, పుష్కరిణి చెంత ఆంజనేయ ఆరాధన, మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణలో భక్తులు కుటుంబీకులతో పాల్గొని ఆశీస్సులు పొందారు. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులను దర్శించేందుకు భక్తులు సముదాయాలలో బారులు తీరారు. గంటలకొద్ది వేచి ఉండాల్సి వచ్చింది. ప్రసాదాల కోసం బారులు తీరారు. దీంతో భక్తుల కోలాహలంతో యాదాద్రిలో సందడి నెలకొన్నది. భక్తుల రద్దీ పెరుగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైనాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హా రతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన ¬మం ద్వారా శ్రీవారిని కొలిచారు. ఆలయ పనులు పురోగతిలో ఉండడంతో కూడా పలువురు క్షేత్రాన్ని సందర్శించి స్వామిని చూసేందుకు వస్తున్నారు.