యుద్ధ ప్రాతిపదిక గండి పూడ్చాలి-
రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మిర్యాలగూడ, జనం సాక్షి : నిడమానూరు వద్ద నాగార్జున సాగర్ ఎడమకాల్వకు పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం రైతు సంఘం ఆధ్వర్యంలో మొలకల కాలువ మేజర్ కింద నీరందక ఎండిన పొలాలను పరిశీలించి మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కు గండి పడి 10 రోజులు దాటినా గండి పుడ్చటంలో ఎన్ఎస్పి అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది అన్నారు. ఎకరానికి 30 నుండి 40 వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తున్న రైతులకు నీళ్లు బందు కావడం వలన నష్టం వస్తుందని అన్నారు. పొలాలు మొత్తం నెర్రేపెట్టి ఉన్నాయని, మరో నాలుగు ఐదు రోజులు ఇదేవిధంగా ఎండలు వచ్చినట్లయితే పొలాలు పూర్తిగా ఎండిపోతాయని వాపోయారు. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ఎస్పి అధికారులు నిర్లక్ష్యం చేయటవలను పొలాలు ఎండిపోయే పరిస్థితి కొట్టొచ్చినట్టుగా అగపడుచున్నది అన్నారు. ఇదే నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం రైతులకు ఒక ఎకరానికి 40వేలు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుందని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక గండి పూడ్చి నీటిని విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పసుల వెంకన్న, గండ్ర సైదులు, మన్యం సైదులు, చింతమల్ల రాములు, గువ్వల పవన్, మల్లెబోయిన సైదమ్మ, గువ్వల వాసంతి, లక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.