యురి సెక్టార్లో ఉగ్రదాడి.. 17 జవాన్లు మృతి

18slider33జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా యురిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టిన సైన్యం నలుగురిని హతమార్చింది. తెల్లవారుజామున ఐదున్నరకు ఉగ్రవాదులు యురి సెక్టార్ లోని ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పై  కాల్పులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వెంటనే రియాక్టైన ఆర్మీ.. కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ఈ దాడిలో అనేక మంది సైనికులు గాయడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఇంకా జమ్మూ లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది భారత సైన్యం.ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌  శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. యురి సెక్టార్‌పై ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యం లో పర్యటించి అక్కడి అధికారులో సమావేశం కానున్నారు.

సైనిక కేంద్రాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.