యువకుడి ఆత్మహత్య
మెదక్, నవంబర్ 9 : మెదక్ పట్టణం నర్సిఖెడ్ వీధికి చెందిన వనం సుంకయ్య అలియాస్ బలరాం(28) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య,భర్తల మధ్యచిన్నపాటి గోడవలు, ఆర్థిక ఇబ్బందులతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ విజయ్‌కుమార్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భార్యకు కూడా ఉరివెస్తే ఆమె తప్పించుకుందని, భర్తకు మాత్రం ఉరి పడిందని అంటున్నారు. ఈ ఘటన హత్య లేదా ఆత్మహత్య పోస్టుమార్టం నివేదిక తరువాత తెలుస్తుందని తెలిపారు. మెదక్ ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ పోలీసు సిబ్బంది ఘటన స్థలాన్ని సందర్శించారు.