యువకుని దారుణ హత్య
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ శివారు పొలాల్లో బుక్యా రవి (30) అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.