*యువత క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి*

వైస్ యంపిపి నాగటి ఉపేందర్
 రామన్నపేట ఆగస్టు 21 (జనంసాక్షి) రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీ.శే కంచి హనుమమ్మ వెంకయ్య  జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రధానోత్సవ సభ స్వేరోస్ గ్రామ అధ్యకులు ఎర్ర నరేష్ అధ్యక్షతన జరగగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామన్నపేట వైస్ యంపిపి నాగటి ఉపేందర్ హాజరై  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువత క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్లాలని  క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుందని క్రీడల వల్ల చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని  క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, నేటి ఓటమి, రేపటి విజయానికి నాంది అని  అన్నారు. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి  చర్యలు తీసుకోవాలని కోరారు  వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
అనంతరం గురుకులాలో సీట్లు పొందింన విద్యార్థులను,వారి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది
కార్యక్రమంలో స్వేరోస్ మాజీ జిల్లా నాయకులు నోముల యాదగిరి, స్వేరోస్ నాయకులు ఎర్ర భిక్షపతి,కంచి బాలకృష్ణ,ఎర్ర లింగస్వామి, బందెల మహేష్, శివ కంచి నరేష్, కంచి యాదయ్య,జంగిలి దివ్యతదితరులు పాల్గొన్నారు.