యువత క్రీడా రంగాలలో రానించాలి. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.
యువత క్రీడా రంగాలలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని జిల్లా
కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. మంగళవారం తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో 12 వ రోజు పల్లె ప్రగతి – కార్యక్రమంలో బోధ్ శాసన సభ్యులతో కలిపి ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని నర్సరీని పరిశీలించి మో క్కలకు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్ , పంచాయితీ కార్యదర్శి లను అభినందించారు. అనంతరం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆ తరువాత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం తో పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు నిర్వహించాలని అన్నారు. వర్షాకాలం దోమల వలన వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా గ్రామంలోని రహదారులు, మురికికాలువలను ప్రతి రోజు పంచాయితీ సిబ్బంది శుభ్రపరచాలని సూచించారు. వర్షపు నీరు నిలువ ఉండకుండా శుభ్రం చేయాలనీ, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని అన్నారు. పచ్చదనం. పెంపునకు వచ్చే హరితహారంలో విరివిగా మొక్కలు నాటిలా ఖాళీ స్థలాలు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడా రంగాలలో ఎదిగేలా ప్రభుత్వం గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని, యువత సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు. మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ది చెందేలా ప్రజల భాగస్వామ్యంతో వివిధ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, వాలీ బాబ్, కోకో , కబడ్డి చింటి ఆటలలో రాణించాలని అన్నారు. మోడల్ క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద 40 లక్షల నిధులతో ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణాలకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్, కిచెన్ పిడ్ తదితర మౌలిక వసతుల కల్పంచడం జరుగుతుందన్నారు. రైతుబందు , రైతు బీమా, దళిత బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, మిషన్ భగీరత త్రాగునీరు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్షంగా నిలించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపిడి వో రమాకాంత్, గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.