యువత మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడవాలి.
బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు గౌడ్
మక్తల్ నవంబర్ 28( జనం సాక్షి) : మఖ్తల్ పట్టణంలోని వాసవి జ్యోతిరావు పూలే చౌరస్తాలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నాడు మహాత్మా జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు గౌడ్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు ఎంతగానో కృషి చేశారన్నారు. సమాజంలో అన్ని కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే సమాజానికి చేసినటువంటి సేవలలొ భారతదేశ మొదటి సంఘసంస్కర్తగా మహాత్మ జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. యువత మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ ఆశయ సాధన కోసం కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ దత్తాత్రేయ, నారాయణపేట జిల్లా బిఎస్పి జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకులు మద్దిలేటి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.