*యువత వారి నైపుణ్యాలే దేశానికి బలం*

  సామజిక ఆర్థిక విద్యా వేత్త బడుగుల సైదులు.
జులై 14(జనం సాక్షి)
  సాంకేతిక వృత్తి విద్య మరియు శిక్షణ, స్థానిక మరియు ప్రపంచ ఆర్థికవ్యవస్థ లకు సంబంధించిన ఇతర నైపుణ్యాల అభివృధి గురుంచివ అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 15 న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. సాంకేతికంగా ఆర్థికంగా భారత దేశం ప్రపంచంలో అభివృద్ధి చెంది అగ్రగామిగా నిలబడటానికి యువత వారి నైపుణ్యాలు అభివృద్ధి కీలకం బలం అని అభిప్రాయం తెలిపారు.మన దేశంలో 5 సంవత్సరాల క్రితం స్కిల్ ఇండియా మిషన్ ఆరంభం జరిగింది  దాని ద్వారా పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక పాటశాల నుండి యూనివర్సిటీ పరిశోధకులు వరకు తగిన మౌలిక సదుపాయాలు యంత్ర పరికరాల శిక్షణ సిభందిని ఏర్పాటుచేయాలి. రాష్ట్ర  కేంద్రం ప్రభుత్వాలు యువత వారి నైపుణ్యాలు పైన దృష్టి పెట్టాలి.స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ యువత మంత్రం గా ఉండాలి . యువత నైపుణ్యాలను శిక్షణ ద్వారా నేర్చుకోవడం ,నైపుణ్యాలను తనకు తానుగా పెంపొందించు కోవడం, నైపుణ్యం విస్తరింప జేయడం లాంటి చర్యలు ద్వారా  యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.నిరుద్యోగ సమస్య పరిష్కరించ బడుతుంది .తల్లితండ్రులకు భారం తగ్గుతుంది . యువత భవిష్యత్ మానవ వనరులుగా దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది.ప్రపంచం మొత్తం ఇప్పుడు నాలెడ్జ్  నైపుణ్యం చుట్టే తిరుగుతుంది కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రాథమిక విద్య స్థాయి నుండే  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బడుగు బలహీవర్గాలకు పిల్లలకు నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్య అభివృద్ధి కోసం నిరంతరం నిధులు కేటాయించాలి.అందుకు తగ్గ పర్యవేక్షణ,నిధులు వినియోగ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అని కోరారు.