యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం
రామన్నపేట నవంబర్ 10 (జనంసాక్షి)
నేటి యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులుగా చేసి వారు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలని రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం కోరారు. మండలంలోని కక్కిరేణి గ్రామంలో నిరుద్యోగ యువత – స్వయం ఉపాధి అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
డి ఆర్ డి ఏ మరియు నాబార్డు సంస్థల ద్వారా ఎస్ బి ఐ సహకారంతో ఆర్ సే టి చేపట్టిన శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ సే టి) నల్గొండ డైరెక్టర్ ఇ.రఘుపతి పాల్గోని మాట్లాడుతూ భారత దేశ పురోభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే ముడిపడి ఉందని మహాత్మా గాంధీ అన్న మాటలు నిజం చేయాలని దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను యువతలో దాగి ఉన్న తెలివితేటలను సరైన మార్గంలో అభివృద్ధి చేయుటయే ఈ సంస్థ యొక్క లక్షణం అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫీస్ అసిస్టెంట్ శ్రీకాంత్ , సామజిక కార్యకర్త వేముల సైదులు , మెట్టు మధు , ఉదయ శ్రీ , టైలరింగ్ ట్రైనర్ ఏనుగు నవ్య , వేముల అనిల్ , శివ రాకేష్ , సాయి , మను శ్రీ , నవ్య , మమత , హారిక , రజిని , ప్రశాంతి , మౌనిక , పూజ , సంధ్య , రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు