యువరైతు ఆత్మహత్య

: నల్గొండ జిల్లా బుద్ధారం గ్రామంలో మంగళవారం ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి చేను ఎర్రబారి పిందెలు రాలిపోవడం చూసి అప్పులు తీర్చే మార్గం తోచక మనస్తాపం చెంది ఆవుల శేఖర్(23) అనే యువరైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు