యువీకి మొండిచేయి, రాయుడికి ఛాన్స్

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కు చోటు దక్కలేదు. తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలిసారిగా వరల్డ్ కప్ ఛాన్స్ దక్కింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.

ధోనీ ఒత్తిడి కారణంగానే యువరాజ్ ను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత టీ20 వరల్డ్ కప్ లో ఆడిన యువరాజు నిరాశపరిచాడు. దీంతో అతడికి దారులు మూసుకుపోయాయి. మరోవైపు నిలకడగా రాణిస్తున్నఅంబటి రాయుడికి ఎట్టకేలకు ఛాన్స్ దొరికింది. తొలిసారిగా అతడు ప్రపంచకప్ ఆడబోతున్నాడు.