యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా
ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 కోట్లు స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. అతనిపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది.