యూనివర్సిటీల్లో మంచి ఆహారం అందాలి

వర్సిటీ సమస్యలపై విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్‌

హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి):యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల విద్యార్థులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. వర్సిటీల్లోని సమస్యలను గవర్నర్‌ తమిళిసైకు విద్యార్థులు వివరించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్‌ హావిూ ఇచ్చారు. యూనివర్సిటీల్లో మౌళిక సదుపాయాలు కావాలని విద్యార్థులు అడుగుతున్నారని గవర్నర్‌ తమిళిసై అన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. విద్యార్థులు జాబ్‌ సీకర్స్‌ మాత్రమే కాదు…. జాబ్‌ క్రియేటర్స్‌ కూడా అని గవర్నర్‌ మెచ్చుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య ఉత్సవాల సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగలో భాగంగా ఆన్‌లైన్‌ ఎస్సే రైటింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు.