యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌..
` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన
` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు
ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి చేసే సమయంలో నిర్లక్ష్యం 14 మంది చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. కలుషిత రక్తం ఎక్కించడం వల్ల వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సీ సోకినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోకి కాన్పూర్‌కు చెందిన లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది.ఆ 14 మంది చిన్నారులు తలసేమియాతో బాధపడుతున్నారు. వారికి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి అవసరం. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో రక్తమార్పిడి చేయించుకుంటున్నవారిలో ఏడుమందికి హెపటైటిస్‌ బీ, ఐదుగురికి హైపటైటిస్‌ సీ, ఇద్దరికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆ పిల్లలంతా ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారే. ఇప్పటికే తలసేమియా తో బాధపడుతోన్న వీరిని ఈ వైరస్‌లు మరింత ఇబ్బందిపెడతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.’మన ఆరోగ్య వ్యవస్థను డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం మరింత అనారోగ్యంగా మార్చింది. తలసేమియాతో బాధపడుతోన్న 14 మంది చిన్నారులకు కలుషితమైన రక్తం ఎక్కించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇంతటి దారుణమైన నిర్లక్ష్య వైఖరి సిగ్గుచేటు. దసరా సందర్భంగా పది తీర్మానాలు చేసుకోవడం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. కానీ ఆయన ఎన్నడైనా భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాల జవాబుదారీ గురించి ఆలోచించారా..?’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఆ పిల్లలంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరికి అత్యవసర సమయాల్లో పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం ఎక్కించారని విూడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఇన్ఫెక్షన్లు సోకడానికి గల కారణాలు గుర్తిస్తున్నట్లు కాన్పూర్‌ వైద్యాధికారులు వెల్లడిరచారు.