యూపీలో నాలుగో తరగతి సిబ్బంది వైద్యసేవలు

లక్నో: నాలుగో తరగతి సిబ్బంది ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వార్తలు
ఉత్తరప్రదేశ్‌లో వరసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బులంద్‌షహర్‌, బల్లియా,
మీరట్‌, కుశినగర్‌…పలుచోట్ల ఇలాంటి సంఘటనలు మీడియా కెమెరాల కెక్కిన
సంగతి తెలిసిందే. తాజాగా కుశినగర్‌లో స్వయంగా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కారు
డ్రైవరే రోగులకు సెలైన్‌ డ్రివ్‌ పెడుతూ కెమెరాలకెక్కాడు. ఆ విషయాన్ని సీఎంవో
ముందు పెడితే తనకేమి తెలియదని, ఎలా జరిగిందో విచారణ జరిపిస్తానని చెప్పి
తప్పుకున్నారు. అంతకు ముందే మీరట్‌లో ఒక వార్డుబాయ్‌ పోస్ట్‌ మార్టమ్‌ నిర్వహించిన
సంగతి పట్టణంలో కలకలం సృష్టించింది.