యూపీలో 390కి చేరిన మెదడువాపు వ్యాధి మృతుల సంఖ్య
గోరఖ్‌పూర్: మెదడువాపు వ్యాధితో బాధపడుతూ మరో ఏడుగురు పిల్లలు మరణించడంతో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 390కి పెరిగింది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలు నిన్న మరణించారు. నిన్న ఈ ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న 23 మంది చేరారని అదనపు డైరెక్టర్ దివాకర్ ప్రసాద్ తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు రెండున్నరవేల మంది మెదడు వాపు వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరినట్లు అధికారులు తెలియజేశారు.