యూయస్ఏ ఎన్నారై అలుమ్ని ఆధ్వర్యంలో కాకతీయ రీసెర్చ్ డే

ఖిలా వరంగల్, జనంసాక్షి(జూలై 21);
కాకతీయ మెడికల్ కాలేజీ లో యూయస్ఏ ఎన్నారై అలుమ్ని ఆధ్వర్యంలో కాకతీయ రీసెర్చ్ డే కార్యక్రమం రేపు ఏర్పాటు చేయనున్నట్లు విలేకర్లు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారని, అలాగే కాలేజీ స్థాయి లో విద్యార్ధులకు రీసర్చ్ చేయడం వల్ల ఎంతో నేర్చుకుంటారనీ, రిసర్చ్ చేసినా వారికీ బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు.