యోగాతోనే మానసిక పరిపక్వత.
యురోపియన్ దేశాలు,పాశ్చాత్య దేశాలు యోగా ను అభ్యసిస్తున్నాయి.
అదనపు కలెక్టర్ మోతిలాల్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్21(జనం సాక్షి):
యోగాతో మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో సామూహిక యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,ఆయూష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.పతంజలి కాలంనాటి యోగాను మనం పూర్తిగా మర్చి పోయామని, కానీ అనేక యురోపియన్ దేశాలు, పాశ్చాత్య దేశాలు అభ్యసిస్తున్నాయని చెప్పారు.
యోగ వల్ల బుద్ది, పని చేసే సామర్థ్యం పెరుగుతుందన్నారు. యోగ ప్రాముఖ్యతను గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు దానిని తప్పనిసరి చేశాయని తెలిపారు.
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా సాధన అవసరమన్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి ఆరోగ్యం అత్యంత కీలకం అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా కు తప్పనిసరిగా కేటాయించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్లు డాక్టర్ బాలభారతి, డాక్టర్ జాన్సన్ డాక్టర్ గోపాల్ పతాంజలి సభ్యులు జంగయ్య, శ్రీనివాసులు మహాలింగం, ఎం ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి, సంధ్యారాణి విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.