యోగాతో ఆరోగ్యానికి మేలు
గద్వాల,జూన్21(జనం సాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి మండల కేంద్రం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విధ్యరులకు యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ లక్ష్మరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహశీల్దార్ మదన్మోహన్ ఎస్సై గడ్డం ఖాశి హాజరై విద్యార్థులకు యోగా అసనాలవల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢత్వం ఉంటుందని ప్రిన్సిపాల్ అన్నారు. విద్యార్థుల్లో యోగా నేర్పించినప్పటి నుంచి వత్తిడి కాకుండా చదువు లో కూడా ఎంతో ఏకాగ్రత చూయిస్తున్నారు. మరియు విద్యార్థులకు యోగా చేయడం వలన ఎంతో ఆరోగ్యాంగా ఉంటున్నారని చెప్పారు. కేంద్రీయ విద్యాలయ లో చదువు తో పాటు యోగా టీచర్ ను పెట్టుకొని ప్రతి రోజు శిక్షణ ఇప్పిస్తున్నారు, రోజు విద్యార్థులు ఉదయం లేసిన తరువాత బ్రష్ చేయగానే కనీసం అరగంట సేపు యోగా చేయాలనీ విద్యార్థులతో ప్రిన్సిపల్ కోరారు. 5వేల సంవత్సరాల క్రితం మన భారత దేశానికి చెందిన ఋషులు ద్వారా ఈ యోగాను కనిపెట్టడం ఎంతో గర్వంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలోఉమాపతి పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.