యోగా షెడ్ కు భూమి పూజ.
మల్లాపూర్ జనం సాక్షి సెప్టెంబర్:12 మండలంలోని వేంపల్లి,వెంకట్రావు పేట గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మల్లాపూర్ మండల ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు గ్రామ సర్పంచ్ జోగుల మమత-రాజేష్ ల ఆధ్వర్యంలో వెంకట్రావుపేట ఆయుర్వేదం హాస్పిటల్ కు అనుబంధంగా నూతనంగా యోగా షెడ్ మరియు టాయిలెట్స్ నిర్మాణమునకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇట్టి నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య అధికారి కృష్ణవేణి, ఉప సర్పంచ్ కొడిమ్యాల రవి, ఎంపీటీసీ తోట సుజాత-శ్రీనివాస్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి నరేష్, గంగా గౌరీశ్వర చైర్మన్ ఎల్లాల కృష్ణారెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లాల జీవన్ రెడ్డి, నాయకులు జోగుల రాజేష్, తోట శ్రీనివాస్, యాదగిరి నర్సింగరావు, జోగుల లింగయ్య, నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.