రంగనాయకుల గుట్ట.. బావుని చెరువు.

శాతవాహనుల ఆనవాళ్లు..!

 

గుట్టపై వేలుగు చూసిన అరుదైన శ్రీ రంగనాయకుల శిల్పం.

కనుమరుగైన బావుపేట వెనుక మిస్టరీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో విలువైన చారిత్రక సంపద.

జనం సాక్షి ప్రత్యేకం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 18 (జనంసాక్షి).

చరిత్ర తాలూకు ఆనవాళ్లు అనేకం మన చుట్టూనే ఉన్నాయి. మన పూర్వీకులకు సంబంధించిన ఎన్నో గుర్తులు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే నిక్షిప్తమై అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు జనంసాక్షి ప్రత్యేక కథనాలుగా అందించింది. శాతవాహనుల కాలానికి సంబంధించిన గుర్తులు పట్టి చెబుతున్న రంగనాయకుల గుట్ట కు సంబంధించి తొలిసారిగా పరిశోధనాత్మక కథనాన్ని జనం సాక్షి ప్రత్యేకంగా అందిస్తుంది.

చరిత్ర పుటలను తిరగవేస్తే శాతవాహంలో కాలానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం 230 నుండి క్రీస్తుశకం 220 వరకు 450 సంవత్సరాలు శాతవాహనులు భారతదేశంలో విస్తారమైన భూభాగంలో తమ పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తుంది. ఈ కాలంలో విస్తారంగా వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుండి ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు జరుగుతుండేవని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలు కేంద్రలను అనవుగా మలుచుకున్న శాతవాహన రాజులు ఆనాటి సమాజంలో అభివృద్ధి లో అనేక ఆవిష్కరణలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతంలోని కోటిలింగాల రాజధాని చేసుకొని పాలన సాగించినట్లు చరిత్రకారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

మానేరు పరివాహక ప్రాంతం కూడా వాణిజ్య కేంద్రంగా ఉండిందా. !

ఇటీవల జనంసాక్షి లో శాతవాహన కాలం నాటి లోహ శుద్ధి కేంద్రం ఆనవాళ్లకు సంబంధించిన ప్రత్యేక కథనం అందించిన విషయం తెలిసిందే. గతంలో మానేరు తీరంలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులో మైసమ్మ గుండు సమీపంలోని ప్రాచీన వాణిజ్య కేంద్రానికి సంబంధించిన కథనాన్ని అందించడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కటిగా కలిపి చూస్తే ఈ ప్రాంతం శాతవాహనులకు ప్రధాన కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది.

కనుమరుగైన బావువుపేట వెనుక మిస్టరీ.

శాతవాహన కాలానికి సంబంధించిన ఆనవాళ్లు జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై అధ్యయనం కొనసాగిస్తున్న క్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పరిశోధన ముందుకు సాగింది. ఇక్కడ ప్రస్తుతం ఉనికిలో లేని రెండు గ్రామాల పేర్లు గ్రామస్తులు ప్రస్తావించారు. ఒకటి బావు పేట, రెండవది నర్సంపల్లి.. మొదటి ప్రాంతంలో పరిశీలన కొనసాగింది. వెంకటాపూర్ శివారులోని లోహ శుద్ధి కేంద్రం చిట్యాల పెంట వద్ద కనిపించినటువంటి ఏకస్తంభం ఇక్కడ పొలాల్లో కనిపించింది. స్తంభం పరిశీలిస్తే హనుమంతుని విగ్రహంతో పాటు శాతవాహనుల కాలానికి సంబంధించిన కొన్ని గుర్తులు అస్పష్టంగా కనిపించాయి. చుట్టూ పరచుకున్న పచ్చని పొలాల్లో భూమి పొరల కింద ఒకనాటి బావుపేట గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏక స్తంభానికి సరిగ్గా ఎదురుగా రంగనాయకుల గుట్ట గా పిలిచే ప్రాంతం ఉంది. శాతవాహనులు అన్ని ధర్మాలను సమంగా చూసిన వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించినట్లు తెలుస్తుంది. అట్లా రంగనాయకుల గుట్ట శిఖర భాగంపై ఓ పెద్ద గుండు పైన హనుమంతుని ప్రతిమతో పాటు రంగనాయకుల ప్రతిమలు పాటు వైష్ణవ గురువు. ప్రతిమ చెక్కి ఉంది. కింది భాగంలో మరో గుండు పై నాలుగు బ్రతిమలు స్పష్టంగా చెక్కి కనిపిస్తున్నాయి. ఇవన్నీ శాతవాహనుల కాలానికి సంబంధించిన గుర్తులను స్పష్టం చేస్తున్నాయి. శాతవాహనుల అనంతర కాలంలో ఈ ప్రాంతం నుండి వాణిజ్యం పూర్తిగా నిలిచిపోవడంతో బావుపెట గ్రామం కనుమర్గైనట్లు తెలుస్తోంది పూర్తి చరిత్ర వేలుగులోకి వచ్చి మిస్టరీ వీడాలంటే చరిత్ర పరిశోధకులు మరిన్ని విషయాలను వేలుగులోకి తేవాల్సి ఉంది.

శాతవాహన కాలనాటి చెరువు.

రంగనాయకుల గుట్టను అనుకుని గుట్ట వెనుక వైపు నిర్మించిన చెరువు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికీ నీటితో కలకలాడుతున్న ఈ చెరువును స్థానికులు బావుని చెరువుగా పిలుస్తారు. చెరువు కూడా శాతవాహన సంస్కృతికి అద్దం పడుతుంది చేరులోకి దిగేందుకు నిర్మించిన రాతి మెట్లతో ఇప్పటికీ ఆనాటి చరిత్ర ఆనవాళ్లను పదిలంగా దాచింది. ఆ కాలంలో ఈ చెరువులోనే స్నానం ఆచరించి గుట్టపై ఉన్న రంగనాయకులకు ప్రత్యేకంగా పూజలు చేసే వారిని తెలుస్తుంది. చెరువు నుండి గుట్ట శిఖర భాగానికి చేరుకునే మార్గం కూడా సులభంగా ఉంది. చేరురు మత్తడి కాలువ ద్వారా ఇప్పటికి వెంకటాపుర్ లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. రంగనాయకుల గుట్ట చుట్టూ పరుచుకున్న శాతవాహన గురుతులెన్నో ఇవి కండ్లమందు చూపుతున్నాయి