రంగారెడ్డిలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

987

రంగారెడ్డి : రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 48 మంది ఓట్లు ఉంటే కేవలం ఉదయం పది గంటల వరకు కేవలం ఆరుగురు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటు రూ.6 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం.
జిల్లాలో జరుగుతున్న రెండు సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), బుక్క వేణుగోపాల్ (టిడిపి), సుంకరి రాజు (టీఆర్ఎస్), అశోక్ కొత్త (స్వతంత్ర). జిల్లాల్లో మొత్తం 771 మంది స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 347 మంది ఉండగా, మహిళా ఓటర్లు 424 మంది ఉన్నారు. దీనితో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది.