రంగారెడ్డి కోర్టులో లంచగొండి
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని కొత్తపేట కమర్షియల్ టాక్స్ కాలనీలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి కోర్టు ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి కోర్టులో బెయిల్ రిలీవర్‌గా కృష్ణ హోహన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. శాస్ర్తి అనే వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఈ రోజు అధికారులు పట్టుకున్నారు. మోహన్ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.