రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి
హైదరాబాద్: వచ్చేవారం రంజాన్ పండగ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలోని మీరాలం ఫిల్టర్ ఈద్‌గాను రాష్ట్ర మైనారిటీ మంత్రి అహ్మదుల్లా సందర్శించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆయనతో పాటు బహదూర్‌పురా ఎమ్మెల్యే మొజంఖాన్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖుస్రుపాషా, జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్స్క్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.