రక్తదానం చేసి ప్రాణ దాతలు కండి.
నెన్నెల ఎస్సై రాజశేఖర్.
బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి)
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 21న పోలీస్ అమరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని రేపు బెల్లంపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈకార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, యువతీయువకులు, అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలకు కాపాడే వారిగా నిలవాలని సూచించారు.