రక్తహీనతను తగ్గించేందుకు పౌష్టికాహారం తీసుకోండి.
ఐరన్ ఫుడ్ తీసుకోండి.
హిమోగ్లోబిన్ పెంచండి.
విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ:: జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య.
ములుగు బ్యూరో,సెప్టెంబర్15(జనం సాక్షి):-
రక్తహీనతను తగ్గించేందుకు పౌష్టికాహారం తీసుకొని హేమోగ్లోబిన్ సరియైన మోతాదులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు.
గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జాకారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్ర ఆల్బెండజోల్ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 527 మందికి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. ముఖ్యంగా ఇది పిల్లలలో నులిపురుగుల నివారణ చేస్తుందని అన్నారు. తద్వారా విద్యార్థులలో రక్తహీనతను నివారిస్తుంది, పోషకాల గ్రాహ్యతను మెరుగుపరుస్తుంది, ఏకాగ్రత నేర్చుకోగల సామర్థ్యము, పాఠశాలకు హాజరు కావడానికి మెరుగుపరుస్తుంది ,పర్యావరణంలో నులిపురుగుల వ్యాప్తిని తగ్గించి సమాజానికి మేలు చేస్తుంది. జిల్లా అంతటా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో పాఠశాలలలో అంగన్వాడీ సెంటర్లలో ఒకటి నుండి 19 సంవత్సరంలో లోపు వయసు కలిగిన పిల్లలకు ఈరోజు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అర్హత కలిగిన పిల్లలు 71,479 ఉన్నారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. 581 అంగన్వాడీ సెంటర్ల ద్వారా 442 పాఠశాలలు మరియు కాలేజీల ద్వారా ప్రభుత్వం మరియు 49 ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ విద్యాశాఖ ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ గండి కల్పన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ విపిన్,రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జోష్ణ వైస్ ప్రిన్సిపాల్ టీ పిచ్చి రెడ్డి,శ్రీధర్ రావు,సురేష్ , ఆంజనేయులు,వినోద్ కుమార్,మమత, బాలకృష్ణ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డెమో తిరుపతయ్య సి హెచ్ ఓ దుర్గారావు ప్రోగ్రాం మానిటరింగ్ ఆఫీసర్ సంపత్ ,హెచ్ ఈ భాస్కర్, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది స్థానిక ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.