రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తిని సాధించాలి
రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తిని సాధించాలి
టేకులపల్లి, అక్టోబర్ 26 (జనం సాక్షి): బొగ్గు ఉత్పత్తి, రవాణాలో రక్షణ సూత్రాలను ఎల్లప్పుడూ పాటిస్తూ సాధించాలని జనరల్ మేనేజర్ ( ఎడ్యుకేషన్)& కన్వీనర్ ఎన్ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం కోయగూడెం ఉపరితల గని యందు 54 వ వార్షిక భద్రత పక్షోత్సవాలను ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కన్వీనర్ భద్రత జెండాను గని ఆవరణంలో ఎగరవేసి ప్రారంభించారు. తదుపరి ఉద్యోగులచే గని రక్షణాధికారి రక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ సూత్రాలను ఎల్లప్పుడు పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, రక్షణ పై అందరికీ అవగాహన ఉండాలని, “నా భద్రత – నా కుటుంబ బాధ్యత” అనే నినాదంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా పని స్థలాలలో తమకు కేటాయించిన పనులను పూర్తి చేసి, ఎటువంటి ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దుటలో అందరూ భాగ్యస్వాములు కావాలని అన్నారు. అనంతరం వార్షిక రక్షణ ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించి నటువంటి క్విజ్ పోటీలు విజేతలకు, ట్రేడ్ టెస్ట్ విజేతలకు, ఉత్తమ రక్షణ పై అవగాహన కలిగిన డిపార్ట్మెంటల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బహుమతులు ప్రధానం చేశారు. తనిఖీలో భాగంగా గనిలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏరియా జి.యం జాన్ ఆనంద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్, ఇతర కమిటి సభ్యులు, రాజమల్లు, డివై.జి.యం ఎస్.టి.పి.పి, బి.శంకర్ రావు, డివై.జి.యం (ఇ&యం) ఓ.సి, బాలాజీ నాయుడు, డివై.జి.యం (సర్వే), పోషమల్లు డిప్యూటీ మేనేజర్,పి. శ్రీనివాసు ఏరియా రక్షణాధికారి, ఏరియా ఇంజనీర