రక్షణ స్టీల్స్‌తో ఒప్పందాలు రద్దు చేస్తూ జీవో జారీ
హైదరబాద్: వివాదస్పద జీవోలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కటిగా దిద్దు బాటు చర్యలు చేపడుతోంది. రక్షణ స్టీల్స్‌కు సంబంధించి గతంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా బయ్యారం నేలకొండపల్లి, గార్ల ప్రాంతంలోని ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతిస్తూ జారీ చేసిన ఒప్పందాన్నిఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి డి.శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన జీవో నెంబరు 106ను జారీ చేశారు. ముడి ఇనుము తవ్వకాలతో పాటు సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఏపీఎండీసీతో రక్షణ స్టీల్స్ కుదుర్చుకున్న ఒప్పందాల కోసం జారీ చేసిన జీవో నెంబరు 69ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేశామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.