రఘనందన్‌రావు బంధుల ఇంట్లో సోదాలు
– రూ. 18.67 లక్షలు పట్టివేత
– పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
– పరిస్థితి ఉద్రిక్తం
సిద్ధిపేట,అక్టోబరు 26(జనంసాక్షి):ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమపై వేధింపులకు దిగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. రఘునందన్ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్ రావు నివాసాల్లో సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు. అయితే బీజేపీ అభ్యర్థి, అతని బంధువుల నివాసల్లో పోలీసులే డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, రఘునందన్ రావుకు నడుమ తీవ్ర వాద్వాదం చోటు చేసుకుంది. ఓ సమయంలో తీవ్ర తోపులాట జరగడంతో రఘునందన్ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.ఈ విషయం తెలుసుకుని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు కావడంతో ఆయన గట్టిగా కేకలు వేయడంతో గట్టిగా కేకలు పెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సురభి రాంగోపాలరావు, అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18 లక్షల నగదు దొరికిందని సీపీ తెలిపారు. అంజన్‌రావు బంధువు జితేందర్‌రావు డ్రైవర్ ద్వారా డబ్బు పంపారని తెలిపారు. పంచనామా తర్వాత పోలీసులు డబ్బు బయటకు తెచ్చే సమయంలో 20 మంది బీజేపీ కార్యకర్తలు రూ.5.87 లక్షలు ఎత్తుకెళ్లారని సీపీ చెప్పారు. మిగిలిన రూ.12.80 లక్షల డబ్బును సీజ్ చేశామన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమపై వేధింపులకు దిగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. రఘునందన్ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్ రావు నివాసాల్లో సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు.అయితే బీజేపీ అభ్యర్థి, అతని బంధువుల నివాసల్లో పోలీసులే డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, రఘునందన్ రావుకు నడుమ తీవ్ర వాద్వాదం చోటు చేసుకుంది. ఓ సమయంలో తీవ్ర తోపులాట జరగడంతో రఘునందన్ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.