రఘునాథాచార్య మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ):  ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మ¬పాధ్యాయ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు.  రఘునాథాచార్య స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  రఘునాథాచార్య స్వామి మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు అన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా సంప్రదాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్‌ స్వాములతో పాటు ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన వ్యక్తి  రఘునాథాచార్య స్వామి అన్నారు. తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనిషి అని కొనియాడారు.