రఘురామరాజన్ సేమ ఇలా..
అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సహా బృందంలో చోటు
వాషింగ్టన్,ఏప్రిల్ 11(జనంసాక్షి): ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57)కు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణుతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాను అందిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందు పడుతున్న తమ సభ్యదేశాను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానా రూపక్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగశ్రేణి నిపుణు సహాు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమ్యూ సేవను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీక పరిణామాు, ఇతర విధి విధానాపై ఈ టీం సూచను చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్టేల్రియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితయి కమిటీలో వున్నారు. కాగా కోవిడ్`19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.