రఘువీరాతో టీఆర్‌ఎస్‌ ఉమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. నీలం తుఫాన్‌ బాధిత ప్రాంతాలకు నష్ట పరహారం విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అంతకు సచివాలయంలో రఘువీరా ఛాంబర్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బైఠాయించి ఆందోళనకు దిగటంతో మంత్రి వారిని చర్చలకు ఆహ్వానించారు.