రచయితలకు స్వేచ్ఛ లేదు.. రక్షణ లేదు

3
– ఢిల్లీలో నిరసన ర్యాలీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జనంసాక్షి): ఢిల్లీ మండి హౌస్‌ దగ్గర రచయితలు నిరసన చేపట్టిన రచయితలు పలుఉవరు  రచయితలపై దాడులకు నిరసనగా సాహిత్య అకాడవిూ వరకు ర్యాలి నిర్వహించారు. అనంతరం సాహిత్య అకాడవిూ ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటి వరకు 40 మంది రచయితలు సాహిత్య అకాడవిూ అవార్డులు వెనక్కు ఇచ్చిన సంగతి తెలిసిందే.రచయితలకు  రచయితలకు స్వేచ్ఛ లేదు.. రక్షణ లేదని ప్ల్రకార్డులను ప్రదర్శించారు.

అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితలు సమావేశానికి హాజరు కావాలని సాహిత్య అకాడవిూ రచయితలకు పిలుపునిచ్చింది.కొద్ది రోజుల క్రితమే 150 దేశాలకు చెందిన రచయితలు భారత రచయితల పోరాటానికి మద్దతు పలికారు. వ్యక్తి వాక్‌ స్వాతంత్యాన్రికి రక్షణ కల్పించాలని రచయితలు డిమాండ్‌ చేశారు. పెన్‌ ఇంటర్నేషనల్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, సాహిత్య అకాడవిూలకు లేఖ రాసింది. దేశంలోని రచయితలకు రక్షణ కల్పించాలని లేఖలో కోరింది. ఈ ఉద్యమాన్ని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి. ఇది కృత్రిమ ఉద్యమమని ఆ పార్టీ నాయకులు అన్నారు. 1984లో ప్రజాస్వామ్య హక్కులు హరించిన ఎమర్జెన్సీ సమయంలో ఎందుకు ఈ రచయితలు మాట్లాడలేదని ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని అడిగారు. వివిధ సందర్భాల్లో నొరెత్తని వారు ఇప్పుడు కావాలనే ఇలా బిజెపిని అప్రదిష్ట పాలుచేసేందుకు పన్నాగం పన్నారని అన్నారు.