రజక బంధు ప్రకటించి బీద రజక కులస్తులను ఆదుకోవాలి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి): రజక బంధు ప్రకటించి బీద రజక కులస్తులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో రజకులు అన్నివిధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించాలని కోరారు. మంగళవారం హుజుర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహం నందు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రజక కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని, అదేవిధంగా ఉచిత కరంటును సక్రమంగా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు గోపిరజక కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో 17 రాష్ట్రాలలో రజక కులస్తులు ఎస్సీలుగా ఉండటంచే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పురోగతి చెందుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులు ఓబీసీలుగా ఉండటంచే అన్ని విధాలుగా నష్టపోతున్నారని, రాష్ట్ర ముఖ్యసలహాదారులు నడిమింటి శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేసారు. కావున తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వొడ్లనపు సత్యనారాయణ, హుజుర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు తాతరాజు రామలింగం ,నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఉల్లెందుల వెంకటేశ్వర్లు, ఘనపవరం గ్రామ అధ్యక్షులు ఆత్కూరి రామకోటయ్య, ఉపాధ్యక్షులు గూడెపు వెంకటేశ్వర్లు, గూడెపు లక్ష్మీనర్సయ్య, యు.వెంకటేశ్వర్లు, యు.సీతరాములు, బోతరాజు రాము, గవస్కర్, ముత్యయ్య , అంజయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.