రసాయన శాస్త్రంలో నాంపల్లి వెంకటేష్ కు డాక్టరేట్
ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 13
ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటేష్ రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. రసాయన శాస్త్రంలో నావల్ చార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్సెస్ ఆఫ్ మల్టీసైట్ డోనర్స్ అండ్ పై ఆక్సెప్టర్స్, సింథసిస్, స్పెక్ట్రోస్కోపిక్ క్యారెక్టరైజేషన్, థర్మోడైనమిక్, ఆంటీ బ్యాక్టీరియల్ అక్టివిటి, సిటి-డిఎన్ఏ బైండింగ్ అండ్ డిఎఫ్టి (గ్యాస్ ఫెస్ మరియు పిసిఎం) స్టడీస్ అనే అంశంపై ప్రయోగాత్మక పరిశీలన గ్రంథాన్ని ప్రొఫెసర్ టి.పార్ధసారథి పర్యవేక్షణలో సమర్పించారు. తన పరిశోధన కాలంలో 11 పరిశోధన పత్రాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని తెలిపారు. మరో 4 పుస్తకాలను వ్రాసి ముద్రించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేష్ డాక్టరేట్ సాధించడం పట్ల గ్రామస్తులు స్నేహితులు అభినందించారు.