రహదారిపై ప్రమాదంలో ఒకరు మృతి
ఖమ్మం,ఫిబ్రవరి28(జనంసాక్షి): పెనుబాక మండలంలోని మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గొట్టెళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11మందికి తీవ్రగాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన సింగరేణి కార్మికుడు వీరస్వామి కారులో మల్లూరు గుడికి వెళ్లి తిరిగివస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరస్వామి మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న 11మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుబాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.