రాందేవ్ దీక్షకు టీడీపీ మద్దతు
ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, సీఎం రమేష్‌లు రాందేవ్‌బాబాను కలిసి మద్దతు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా రాంలీలా మైదానంలో రాందీక్ష చేస్తున్నారు.