రాంరెడ్డి విజయచండీయాగం

సూర్యాపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మూడు రోజులపాటు ‘విజయ చండీ యాగం’ చేపట్టారు. ఇందు కోసం కర్ణాటక నుంచి రుత్విక్కులు, పండితులు వచ్చారు. యాగాన్ని ఆదివారం రాత్రి యాగం ప్రారంభించగా మంగళవారం పూర్ణాహుతితో ముగుసింది. దామోదర్‌రెడ్డి సీఎం పదవి ఆశించి.. అది ఫలించడం కోసమే యాగం చేస్తున్నారంటూ ప్రచారం చేశాయి. విషయం ఆయనకు తెలియడంతో విూడియా ప్రతినిధులను అక్కడి నుంచి పంపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో రావాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం పదవి కోసమే యాగం చేస్తున్నామనడం అవాస్తవమన్నారు. చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాను. ఏరోజు పదవుల కోసం పాకులాడలేదు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషమేనన్నారు.