రాజకీయాల్లో యువతకు ప్రోత్సాహం
చంద్రబాబు ప్రకటనతో యువతకు అవకాశాలు
నైపుణ్యాల దిశగా మార్గాలు
అమరావతి,మే30(జనం సాక్షి): తెలుగుదేశంలో కొత్త రాజకీయ శక్తిని నింపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మరో ఏడాదిలో ఎన్నికలు సవిూపస్తున్న తరుణంలో యువకులకు పెద్దపీట వేస్తామని, వారిని ప్రోత్సహిస్తామని ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహానాడులో చేసిన ప్రకటన వారితో ఉత్సాహం నింపిందనే చెప్పాలి. ఇప్పటికే టిడిపి నేతలు చాలామంది తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. వీరంతా మ హానాడులో బాగానే చురుకుగా ఉన్నారు. దీంతో రానున్న ఎ న్నికల్లో యువతకు ప్రాదాన్యం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుయువతను అంతర్జాతీయ ప్రమాణాల దిశగా ప్రోత్సహించిన తొలిముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని పేర్కొనడంలో అతిశయోక్తిలేదు. 2020 నాటికి నైపుణ్య శిక్షణకు నవ్యాంధప్రదేశ్ ప్రధాన కేంద్రం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2029 నాటికి పది ప్రపంచ అగ్రస్థాయి నైపుణ్యకేంద్రాలను ఏర్పాటుచేసి రెండు కోట్ల మంది నిపుణులను అందించాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఈ శిక్షణ పూర్తిచేసిన యువత ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఉపాధి సాధించే సామర్థ్యాల్ని కలిగివుంటారు. ఈ స్వప్నసాకారానికి ప్రపంచదేశాల మద్దతును కూడగడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తునేవున్నారు. ఈ దశలో వారికి రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే అనేకమంది ఈ దిశగా పార్టీలో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించటానికి మిలాఖత్ అయ్యాయని చంద్రబాబు చెప్పారు. వారి కుట్రలను సాగనివ్వకుండా ఉండాలంటే కార్యకర్తలు, నాయకులు ఐక్యతతో ఎదుర్కోవటం ఒక్కటే మార్గమని ఉద్భోదించారు. ఆయా పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని అల్లరి చేయటానికి లేని సంఘటనలను సృష్టించడం, చిన్న విషయాలను భూతద్దంలో ప్రచారం చేస్తూ ప్రజల్లో విద్వేషాలను పెంచటం.. ఆఖరికి వేంకటేశ్వరస్వామిని కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడు కుంటున్నారని.. ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేసే ఇటువంటి దుష్పచ్రారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో యువత కీలకంగా ఉండాలని అన్నారు. దుష్పచ్రారాలను తిప్పికొడుతూ సమర్థంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా యువసైన్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. తెలుగుయువత బంగారు భవిష్యత్‌ను ఆకాంక్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో దేశ ప్రగతిలో కీలక భూమిక పోషించే యువత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమానదేశాలు, అగ్రదేశాల ఉత్పత్తి, ఉపాధి విధానాలను గ్రహించి, మొట్టమొదటిసారిగా నైపుణ్య, అభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రారంభించింది. ఉపాధి అవకాశాల విూద ఉన్నత స్థాయి అధికారుల, నిపుణుల సలహాలను సేకరించి యువతకు ప్రయోజనాత్మక విధానాలను రూపొందించారు. యువత ఉపాధి దృష్ట్యా భారీ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆయన నిరంతరం కృషి చేస్తునేవున్నారు. అంతర్జాతీయస్థాయిలో వ్యాపార భాగస్వామ్య సదస్సులు నిర్వహించి భారీస్థాయిలో పెట్టుబడుల సేకరణకు కృషి చేశారు. అంటే యువతను రాజకీయంగా, పారిశ్రామికంగా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మస్థయిర్యం నింపాలన్న లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. గ్రావిూణ నేపథ్యం కలిగిన యువత చదువులు పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, సంస్థల్లో ఉద్యోగాలు సాధించాలంటే వారికి తగిన శిక్షణ అవసరం. దీనిని గ్రహించిన ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక విద్యారంగాల్లో పరిణామాలను యువత అవగతం చేసుకొనే విధంగా తగిన ఎలక్టాన్రిక్ సదుపాయాలను ఏర్పాటు చేసారు. వారిలో నైపుణ్యాలు పెంచి వారిని స్వయం సమృద్ది దిశగా ప్రోత్సహిస్తున్నారు.