రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి
వరంగల్: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కడవెండిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఐకాస నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తాము నూరు శాతం మద్దతిస్తామని, కలిసి పనిచేస్తామన్నారు. కోదండరాంను కేసీఆర్ బలిపశువును చేసే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.