రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలది దిక్కుమాలిన రాజకీయం.రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలది దిక్కుమాలిన రాజకీయం.కొల్లూరు కిషోర్.


కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష నాయకులు దిక్కుమాలిన రాజకీ యాలు చేస్తున్నారని ఉమ్మడి కోటగిరి మండల బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమ వారం రోజున మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొల్లూరు కిషోర్ మాట్లాడుతూ.సుంకిని గ్రామంలో రేవంత్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు.ఉమ్మడి కోటగిరి మండలంలో పంట నష్టం అంతగా జరగలేదు,సుమారు రెండు ఎకరా లలో పంట నష్టం వాటిల్లిందన్నారు.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి తనయలపై రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను వారు తీవ్ర స్థాయిలో ఖండించారు. నియోజక వర్గంలో స్పీకర్ చేసిన అభివృద్ధి పనులను జీవించుకోలేక చిల్లర రాజకీయాలు,రాజకీయంగా రెచ్చగొట్టే వాక్యాలు చేయడం రేవంత్ రెడ్డికి సబబు కాదన్నారు.ఈ మీడియా సమావేశంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,సుంకినీ సర్పంచ్ మాధవరావు, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్ రావు, కోటగిరి గ్రామ అధ్యక్షులు కులకర్ణి అనిల్,బిఆర్ఎస్ నాయకు లు పాల్గొన్నారు.