రాజగోపాల్‌రెడ్డి వక్యవహారంపై కాంగ్రెస్‌ సీరియస్‌

ప్రత్యమ్నాయ చర్యలపై అధిష్టానం పరిశీలన

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాగ్రెస్‌ను వీడుతారని
ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. దీంతో తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. కోమటిరెడ్డి వహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. రాజగోపాల్‌ రెడ్డిపై తక్షణంనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటకే చర్యలు తీసుకోవాలని నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేసి బిజెపిలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడుపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. అభ్యర్థి కోసం మంతనాలు చేపట్టింది. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కూతురు స్రవంతి, ప్లలె రవి, నల్గొండ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీలో రాజగోపాల్‌ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, ఈటల, వివేక్‌ లతో రాజగోపాల్‌ రెడ్డి సంప్రదింపులు జరిపారు. రెండుమూడు రోజుల్లో మరోసారి నేతలు ఢల్లీికి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.