రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో వేడెక్కుతున్నరాజకీయం

ఢళ్లీికి వెళ్లనున్న ఈటెల, డికె అరుణ
మునుగోపైనా, చేరికలపైనా చర్చించే అవకాశం

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనంసాక్షి): రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలోమునుగోడు ఉప ఎన్నికకు బీజేపీసిద్ధమైంది. ఢల్లీికి బీజేపీ ముఖ్యనేతలు ఈటల , డీకే అరుణ , వివేక్‌ తదితరులు వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్‌ షా సహా.. బీజేపీ ముఖ్యనేతలను కలవనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరికకు హైకమాండ్‌ అనుమతి తీసుకోనున్నారు. అలాగే రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకునే తేదీ ఢల్లీి పెద్దలు నిర్ణయించనున్నారు. రాజగోపాలరెడ్డితో పాటు పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. కాగా మునుగోడు ఉపఎన్నికను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడును గెలిచి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు సవాల్‌ విసరాలని అమిత్‌ షా ఆదేశించినట్లు సమాచారం. కాగా మంగళవారం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌? పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాజావార్తలు