రాజాపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలి.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 22 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ నాగర్ కర్నూలు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు.
మా గ్రామాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలంలో కొనసాగించాలి.
వనపర్తి జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఏదుల మండలం మాకు వద్దని.అందుకు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అదేవిధంగా
మా రాజపూర్ గ్రామస్థులము మా గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఏదుల మండలంలో కలపాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుల మండలంలో రాజాపూర్ గ్రామాన్ని కలపాలని చూస్తున్నారని . దీని వలన మాకు స్థానికంగా చదువుకుంటున్న విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు 95 % స్థానికత కోల్పోవడంతో పాటు , ఉద్యోగ అవకాశాలు అదే విధంగా సౌలభ్యపరంగా చాలా ఇబ్బందులకు గురౌతామని కాబట్టి మా గ్రామాన్ని ఎట్టిపరిస్థితులలో కోడేర్ మండలం , నాగర్ కర్నూల్ జిల్లాలోనే కొనసాగించగలరని రాజపూర్ గ్రామ ప్రజలు యువకులు , విద్యావంతులు , మేదావులు మరియు నిరుద్యోగులు కోరుకుంటున్నాము అని కలెక్టర్ కి వనతీ పత్రం ఇచ్చి విన్నవించడం జరిగినది. ఇట్టి విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన మా గ్రామాన్ని మరో జిల్లాలో కొనసాగించాలని చూసినా ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ గ్రామాల ప్రజల తో కలిసి పెద్దమొత్తం లో ఉద్యమం చేస్తామని తెలిపారు.
గ్రామ తీర్మానంలో అందరి వార్డ్ మెంబర్స్ మరియు ఎంపీటీసీ ల మద్దతు మెజారిటీ తీర్మానం కూడా అందరి సమక్షంలోనే జరగాలని అందుకు పూర్తిగా మెజారిటీ ఉంటేనే మేము అంగీకరిస్తాం అని అధికారులకు తెలిపినారు.
ఒకవేళ సింగాయిపల్లి గ్రామాన్ని కొత్త మండలం కేంద్రంగా ఏర్పాటు చేస్తే అదికూడ నాగర్కర్నూల్ జిల్లాలనే కొనసాగితే మా గ్రామాన్ని సింగాయిపల్లి గ్రామంలో కలపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని జేసి కి వివరించడం జరిగిందని తెలిపారు..ఈ కార్యక్రమంలో జే అనిల్ రెడ్డి,తెలుగు రాముడు (ఎల్ ఎల్ బి) సిరాజ్ ద్దిన్,ఎరుకలి శ్రీనివాసులు,మబ్బు రాముడు,సద్దల శివ,తదీతరులు ఉన్నారు