రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా జరుగుతున్న ముందస్తు అరెస్టుల్లో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాజాసింగ్ ను ధూల్‌పేట్‌లో గృహనిర్బంధం చేసిన పోలీసులు, అనంతరం షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు గోషామహల్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం ఛలో ఓయూకు పిలుపునిచ్చిన ఆయనను మంగళ్హాట్లోని తన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, బీఫ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ఆందోళనలు పెద్ద ఎత్తునా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. తనను అక్రమంగా అరెస్టు చేశారని రాజాసింగ్ తెలిపారు. తాను గోపూజలో పాల్గొంటానని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు.