రాజీనామాకు కట్టుబడే ఉన్నా : కావూరి
న్యూఢిల్లీ : నవంబర్ 14, (జనంసాక్షి):
ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సమవేశం ముగిసింది.సమవేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానితో ఏం చర్చించాను అన్నది మీడియాతో పంచుకోలేనని తెలిపారు. పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుతో అసంతృప్తిగా ఉన్నానని చెప్పారు. భవిష్యత్ కార్యచరణపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కోన్నారు…